Medical Colleges Inauguration: నేడు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు.. వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న కేసీఆర్
తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు నేడు ప్రారంభం కానున్నాయి. జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే.
Hyderabad, Nov 15: తెలంగాణలో (Telangana) కొత్తగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు (Govt. Medical Colleges) నేడు ప్రారంభం కానున్నాయి. జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ (CM KCR) వర్చువల్ విధానంలో ఒకేసారి ఈ మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించనున్నారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదు ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆన్ లైన్ ద్వారా ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యాబోధనను లాంఛనంగా ప్రారంభిస్తారు.
కాగా, రూ.4,080 కోట్ల వ్యయంతో ఈ వైద్య కళాశాలలను నిర్మించారు. వీటికి ఆయా జిల్లాల ఆసుపత్రులను అనుసంధానం చేశారు. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో 1,200 మెడికల్ సీట్లను కేటాయించారు.
(The above story first appeared on LatestLY on Nov 15, 2022 08:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

