Hyderabad, July 23: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధించినట్లుందని.. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తే స్వాగతం పలికి పెద్దన్న పాత్ర పోషించమని అడిగాను. పెద్దన్నలా ఉండాల్సిన ప్రధానికి ఇది సరికాదు. ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిధులు అడిగాం. ప్రధాని మోదీని నేనే మూడుసార్లు కలిసి అడిగాను. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపరుద్దామని ప్రధానితో చెప్పాను. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఈ బడ్జెట్, యూనియన్ బడ్జెట్‌పై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు
అయినా తెలంగాణకు అన్యాయం జరిగింది. మా మంత్రులు కూడా కేంద్ర మంత్రులను కలిశారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కోరాం. బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని నిషేధించారు. తెలంగాణ పదాన్ని పలకడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడడం లేదు. తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీకి ఉన్న కక్షను మరోసారి చాటారు’ అని రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ హైలెట్స్
వికసిత్ భారత్ 2047 బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది.
స్వయంగా నేనే మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరా
వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి సహకరించాలని కోరాం.
రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం..
వివక్షను తొలగించి నిధులు కేటాయించాలని కోరాం
మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు.
తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడటంలేదు.
వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదు.
పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయించింది.
మరి పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు?
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డుకు... ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదు.
ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారు
వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారు.
ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. ఇది కుర్చీ బచావో బడ్జెట్...
బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు.
ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు.
బీజేపీ కి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు మాత్రమే కావాలి.. కానీ అభివృద్ధి పట్టదా?
బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి, బాధ్యత వహించాలి.
కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి రాజీనామా చేసి బయటకు రావాలి.
తెలంగాణకు ఐఐఎం ఇవ్వం అని కేంద్రం చెప్పినా... కిషన్ రెడ్డి ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి?
ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే... ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చారు.
తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది.
విభజన చట్టం కేవలం ఏపీకి మాత్రమే కాదు.. తెలంగాణకూ వర్తిస్తుంది...
బడ్జెట్ ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి.
లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే..
కిషన్ రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది.
మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు.
పోలవరంకు నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
పార్లమెంట్ లో నిరసనకు బీజేపీ ఎంపీలూ కలిసి రావాలి.
తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది..
ఇది ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాం..