CM Revanth Reddy Review on Tourism: ఎకో టూరిజం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు, ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్‌లో అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సూచనలు

వచ్చే నెల 10వ తేదీలోగా టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై (Telangana Tourism) అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సూచించారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని చెప్పారు.

CM Revanth Reddy Review on Tourism: ఎకో టూరిజం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు, ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్‌లో అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సూచనలు
CM Revanth Reddy (Photo/X)

Hyderabad, JAN 29: వచ్చే నెల 10వ తేదీలోగా టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై (Telangana Tourism) అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సూచించారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని చెప్పారు. ఎకో, టెంపుల్ టూరిజంపై (Temple Tourism) ఎక్కువగా దృష్టి పెట్టాలన్న సీఎం.. సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డియార్టుమెంట్స్ సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్‌ని అభివృద్ధి చేయాలన్నారు.

Telangana - AP MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నేటి నుండే అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్  

ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్‌లాంటి ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులకు సూచించిన సీఎం.. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని.. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా పాలసీని రూపొందించాలని రేవంత్‌ సూచించారు.

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 10:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).