Telangana Dasara Holidays: తెలంగాణ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి 25 వరకూ దసరా, బతుకమ్మ సెలవులు.. 26న రీఓపెనింగ్
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా, బతుకమ్మ పండుగల సెలవులను ప్రకటించింది. ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి మొత్తం 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
Hyderabad, Oct 1: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పాఠశాలలకు (Schools) దసరా, బతుకమ్మ పండుగల (Dasara, Bathukamma) సెలవులను ప్రకటించింది. ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి మొత్తం 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. 26న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 22న పెద్ద బతుకమ్మ (దుర్గాష్టమి), 24న దసరా అన్న విషయం తెలిసిందే.
సెలవుల్లో ఒకరోజు కుదింపు
గతేడాది దసరా సెలవులు 14 రోజుల పాటు ఇవ్వగా ఈ మారు అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చారు.
(The above story first appeared on LatestLY on Oct 01, 2023 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

