 
                                                                 Vijayawada, Oct 1: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రంలోని స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు (Dasara Holidays) ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 25 తారీఖు వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్ఏ-1 పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 11 వ తారీఖు వరకూ నిర్వహించనున్నారు. ఎస్ఏ-1 పరీక్షల అనంతరం స్కూళ్లకు సెలవులు మొదలవుతాయి. అక్టోబర్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని సర్కారు పేర్కొంది.
ఎనిమిదవ తరగతి మినహా..
ఎస్ఏ-1 పరీక్ష నిర్వహణకు గత సంవత్సరం అనుసరించిన సరి-బేసి విధానాన్ని ప్రభుత్వం ఈ మారు పక్కన పెట్టింది. ఎనిమిదవ తరగతి మినహా మిగతా అన్నీ క్లాసుల పరీక్షలు ఉదయం పూట నిర్వహించేందుకు నిర్ణయించింది. గతంలో 6,8,10 తరగతులకు ఉదయం పూట, ఏడు, తొమ్మిది తరగతుల వారికి మాత్రం మధ్యాహ్నం పూట పరీక్షలు నిర్వహించారు. దీంతో, పరీక్షల నిర్వహణ, సీటింగ్ ఏర్పాట్లు సులువుగా మారాయి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
