Boy Died Choking on Chocolate: తండ్రి ఇచ్చిన చాక్లెట్ తిని బాలుడు మృతి, గొంతులో ఇరుక్కోవడంతో ఊపరాడక కుప్పకూలిన ఎనిమిదేళ్ల బాలుడు, వరంగల్‌ లో విషాదం

సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లిన తర్వాత చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక సందీప్‌ కిందపడిపోయాడు. గుర్తించిన పాఠశాల సిబ్బంది బాలుడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి (MGH Hospital) తరలించారు. తండ్రి కంగర్‌సింగ్‌కు సమాచారం అందించారు.

Boy Died Choking on Chocolate: తండ్రి ఇచ్చిన చాక్లెట్ తిని బాలుడు మృతి, గొంతులో ఇరుక్కోవడంతో ఊపరాడక కుప్పకూలిన ఎనిమిదేళ్ల బాలుడు, వరంగల్‌ లో విషాదం
Representative Image

Warangal, NOV 27: తన కొడుక్కు తండ్రి ఇచ్చి చాక్లెట్ అతని ప్రాణం తీసింది. విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్‌ను నోట్లో వేసుకొని మింగే క్రమంలో ఊపిరాడక మృతి చెందారు ఎనిమిదేళ్ల బాలుడు. వరంగల్‌ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ (Kangar singh) గత కొంతకాలంగా వరంగల్‌లోని డాల్ఫిన్‌ గల్లీలో నివాసిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎలక్ట్రానిక్‌ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా వెళ్లొచ్చారు. ఆయన అక్కడి నుంచి విదేశీ చాక్లెట్లు (chocolate) తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్తుండగా ఆ చాక్లెట్లను వారికి ఇచ్చారు.

Woman Drank Child Blood: పిల్లలు పుడతారని చిన్నారి రక్తం తాగిన మహిళ, క్షుద్రపూజలు చేసి పదేళ్ల చిన్నారిని బలి ఇచ్చిన దుర్మార్గురాలు, జీవిత ఖైదు విధించిన యూపీ కోర్టు 

వారిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లిన తర్వాత చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు.  అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక సందీప్‌ కిందపడిపోయాడు. గుర్తించిన పాఠశాల సిబ్బంది బాలుడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి (MGH Hospital) తరలించారు. తండ్రి కంగర్‌సింగ్‌కు సమాచారం అందించారు.

Youtuber Couple Honey Trap: హనీట్రాప్ కేసులో ప్రముఖ య్యూటబర్లు, బిజినెస్‌మ్యాన్‌పై రేప్‌ కేసు పెడతామంటూ బెదిరించి లక్షలు కాజేసిన జంట 

డాక్టర్లు బాలుడి గొంతులో చాక్లెట్‌ను (choking on chocolate) గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే ఆ చిన్నారి మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 27, 2022 09:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).