New Delhi, NOV 27: ఢిల్లీకి చెందిన ఒక యూట్యూబ్ జంట (Youtube copule) హనీ ట్రాపింగ్‌కు పాల్పడింది. ఒక వ్యాపారిని బెదిరించి అతడి దగ్గరి నుంచి రూ.80 లక్షలకుపైగా వసూలు చేసింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలో 21 ఏళ్ల ఒక వ్యాపారి అడ్వర్టైజ్‌మెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడికి ఢిల్లీలోని షాలిమార్ బాఘ్ (Shalibar bagh) ప్రాంతంలో ఉండే, యూట్యూబ్ ఛానెల్ (Toutube channel) నిర్వహించే నామ్రా ఖాదిర్ అనే మహిళ పరిచయమైంది. బాధితుడు ఖాదిర్‌తో (Khadir )ఒక బిజినెస్ ప్రపోజల్ మాట్లాడాలి అనుకున్నాడు. ఆమెను ఒక రోజు స్టార్ హోటల్‌కు పిలిచి తన కంపెనీకి సంబంధించిన ఒక యాడ్ ప్రపోజల్ గురించి చెప్పాడు. ఇదే సమయంలో ఖాదిర్.. విరాట్ అలియాస్ మనీష్ బెనివల్ (Manish benival) అనే మరో వ్యక్తిని పరిచయం చేసింది. దీంతో ఇద్దరితో తన వ్యాపారం గురించి చెప్పాడు. దీనికి సంబంధించి వారికి రూ.2.5 లక్షలు చెల్లించాడు.
రోజులు గడుస్తున్నప్పటికీ, వారి నుంచి ప్రొడక్ట్ రాలేదు. దీనిపై వ్యాపారి ఖాదిర్, విరాట్‌ను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఖాదిర్ ఆ వ్యాపారిని ఇష్టపడుతున్నట్లు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఖాదిర్, ఆ వ్యాపారి ఇద్దరూ దగ్గరయ్యారు. వారితోపాటు విరాట్ కూడా ఎప్పుడూ పక్కనే ఉండేవాడు. అలా ముగ్గురూ కలిసి చాలా కాలం సన్నిహితంగా ఉన్నారు. ఖాదిర్, ఆ వ్యాపారి ఏకాంతంగా గడిపారు. అయితే, ఇద్దరూ ఏకాంతంగా గడిపినప్పటి వీడియోలు (Private videos), ఫొటోలు వంటి ఆధారాల్ని ఖాదిర్, విరాట్ సేకరించారు. తర్వాత వాటిని బయటపెడతామని చెప్పి ఆ వ్యాపారిని బెదిరించారు. అవసరమైతే అతడిపై రేప్ కేసు పెట్టి జైలు శిక్ష పడేలా చూస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన ఆ వ్యాపారి తరచూ వారికి అడిగినంత డబ్బు ఇచ్చేవాడు. అలా వారికి రూ.80 లక్షలకుపైగా చెల్లించాడు.
అయితే, వేధింపులు మరీ ఎక్కువ కావడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కొద్ది రోజుల క్రితం ఖాదిర్, విరాట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు నిరాకరించింది. కేసు విచారణలో భాగంగా నిందితులకు సంబంధించిన ఇండ్లపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారిపై పలు సెక్లన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.