Manikrao Challenges to BRS: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తా, సవాల్ విసిరిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సవాల్ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

సోమవారం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు కేసీఆర్ బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాణిక్‌రావు ఠాక్రే స్పందిస్తూ.. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా మారిందని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరబోయే 35 మంది లిస్ట్ ఇదిగో, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే
తెలంగాణలో దోచుకున్న సొమ్మును మహారాష్ట్రలో కేసీఆర్ ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 05:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).