Fraud Gang: అలవైకుంఠపురం, RRR, లవ్ స్టోరీ సినిమాకు మీరే నిర్మాతలంటూ రూ.6 కోట్లు మోసం, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, సొంత బంధువులనే మోసం చేసిన కేటుగాళ్లు, రాజమౌళి, ప్రభాస్, అల్లు అర్జున్ పేర్లు కూడా వాడేసిన మోసగాళ్లు
ఆర్ఆర్ఆర్ (RRR), అల వైకుంఠపురం (Ala vikuntapuram lo), లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది వంటి చిత్రాలలో పెట్టుబడులు పెడతామని నిందితులు నమ్మించారు. ఈ సినిమాల్లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు.
Hyderabad, OCT 15: హైదరాబాద్ నగరంలో పెట్టుబడి (Investment) పేరుతో రూ.6 కోట్ల మోసానికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. సినిమాల్లో (Cinema) పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసానికి పాల్పడిందో ముఠా. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు (Software Engineers), వారి బంధువులే లక్ష్యంగా ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ అంశంపై బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూకట్ పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ ఈ మోసానికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ (Film distribution), రియల్ ఎస్టేట్, బోర్‌వెల్స్ రంగాలలో పెట్టుబడుల పేరుతో నిందితులు మోసం చేశారు. ఆర్ఆర్ఆర్ (RRR), అల వైకుంఠపురం (Ala vikuntapuram lo), లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది వంటి చిత్రాలలో పెట్టుబడులు పెడతామని నిందితులు నమ్మించారు. ఈ సినిమాల్లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు.
ఇలా 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వారి బంధువుల నుంచి దాదాపు రూ.6 కోట్ల వరకు వసూలు చేశారు. తీరా ఎలాంటి పెట్టుబడులు ఉన్నట్లు కనిపించకపోవడంతో బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలి అని అడిగారు. అయితే, నిందితులు డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు, దాడికి పాల్పడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి, వారి అనుచరులతో బెదిరించినట్లు బాధితులు చెప్పారు.
తమ దగ్గర డబ్బులు దండుకుని, మోసానికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు హైదరాబాద్, సీపీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 15, 2022 12:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

