Teacher Beats Student Mercilessly: రెండో తరగతి విద్యార్థిని ఘోరంగా చితకబాదిన టీచర్.. గద్వాలలో దారుణం (వీడియో)
గద్వాల జిల్లా అయిజా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిపై తరగతి ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది.
Hyderabad, Jan 31: గద్వాల జిల్లా (Gadwal) అయిజా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో (Private School) రెండో తరగతి చదువుతున్న విద్యార్థిపై తరగతి ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది. వీపుపై చితకబాది విద్యార్థిని తీవ్రంగా గాయపర్చింది. తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు.. గట్టులో నివాసం ఉంటున్న జ్యోతి, కృష్ణానాయక్ దంపతుల ఇద్దరు కుమారులు విరాట్ శంకర్ నాయక్, మోక్షిత్ నాయక్ స్థానిక కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. విరాట్ శంకర్ నాయక్ ను తరగతి ఉపాధ్యాయురాలు కట్టెతో చితకబాదడంతో వీపుపై గాయమైంది. ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద విద్యార్థి బోరున విలపించాడు.
దారుణం.. రెండో తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్
జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ పట్టణంలో ఘటన. శ్రీ కృష్ణవేణి స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న విరాట్. వాతలు పడేటట్లు విరాట్ ను కొట్టిన క్లాస్ టీచర్ మానస. పాఠశాల యాజమాన్యంపై MEO, DEO చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్థానిక పోలీస్… pic.twitter.com/iSitmUl5uY
— ChotaNews App (@ChotaNewsApp) January 30, 2025
ఎంఈవో స్పందన ఇలా..
విద్యార్ధి ఆవేదనను చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు విద్యార్థిని చితకబాదిన విషయం ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాట్లాడగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. దీంతో గురువారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేసి, ఉన్నతాధికారులకు పంపుతామని ఎంఈవో చెప్పారు.
యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు
(The above story first appeared on LatestLY on Jan 31, 2025 09:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

