Telangana: అసలు ఏంటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ? పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

Telangana: అసలు ఏంటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ? పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు
Group 4 Candidates Protest At Hyderabad Gandhi Bhavan(video grab)

Hyd, Oct 18: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

అయితే, తీర్పు వచ్చే వరకు పరీక్షను వాయిదా వేయాలని పిటిషనర్ లు కోరారు. జీవో 29 వల్ల తమకు నష్టం జరుగుతుందని గ్రూప్-1 అభ్యర్థులు న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ జీవో శాపంగా మారిందని తెలిపారు. జీవో 55ను అమలు చేయాలని తాము సీఎంను కోరినప్పటికీ పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు. తమను పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అనంతరం, సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, ఎగ్జామ్స్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకువస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలోని అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్-1 పరీక్షలను నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరారు. అయితే హైకోర్టు ఇందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అక్టోబరు 21న నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడంతో షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరగనున్నాయి.ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సిద్ధమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు, శుక్రవారం అశోక్ నగర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. జీవో 29ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. గ్రూప్-1 అభ్యర్థులపై జరిగిన లాఠీఛార్జ్ మీద కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల డిమాండ్ మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేయాలన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ సరికాదన్నారు. లాఠీఛార్జ్‌ను ఆయన ఖండించారు. విద్యార్థులు న్యాయం కోసం డిమాండ్ చేస్తుంటే లాఠీఛార్జ్ చేస్తారా? అని ప్రశ్నించారు.

(The above story first appeared on LatestLY on Oct 18, 2024 07:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).