TSPSC Chairman Resigns: సీఎంను కలిసిన కొద్ది సేపటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన బి.జనార్ధన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు.

TSPSC Chairman Resigns: సీఎంను కలిసిన కొద్ది సేపటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన బి.జనార్ధన్‌రెడ్డి
TSPSC chairman Janardhan Reddy (Photo-Video Grab)

Hyd, Dec 12: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు.

రాజీనామాకు ముందు సీఎం రేవంత్‌రెడ్డిని జనార్ధన్‌రెడ్డి కలిశారు. కమిషన్‌కు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ ముగిసిన వెంటనే జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం. 2021 మే 21వ తేదీన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బాధ్యతలు జనార్ధన్‌రెడ్డి స్వీకరించారు.

డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఈసీ, తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని సీఈసీకి విజ్ఞప్తి చేసిన ఐపీఎస్‌ అధికారి

జనార్ధన్‌రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1990లో గ్రూప్‌–1 అధికారిగా నియమితులయ్యారు. 1996లో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలన, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, వ్యవసాయ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. వాటర్‌ బోర్డు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సేవలందించారు. అత్యంత నిజాయితీ గల అధికారిగా పేరుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఆయన్ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డులో ప్రస్తుతం ఐదురుగు సభ్యులున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 12, 2023 11:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).