Plane Hijack Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో కలకలం.. విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్.. దుబాయ్ వెళ్లే విమానం రద్దు, ప్రయాణికులను హోటల్‌కు తరలింపు
విమానం హైజాక్ చేస్తామని బెదిరిస్తూ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తాజాగా ఈ-మెయిల్ రావడం కలకలానికి దారి తీసింది.
Hyderabad, Oct 9: విమానం హైజాక్ చేస్తామని (Plane Hijack Threat) బెదిరిస్తూ హైదరాబాద్ (Hyderabad) లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Shamshabad Airport) తాజాగా ఈ-మెయిల్ రావడం కలకలానికి దారి తీసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో దుబాయ్ వెళ్లే ఓ విమానాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
షాకింగ్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్.. ?#Shamsabad #Airport #Alert #NTVNews #NTVTelugu https://t.co/VgxNgfv51b
— NTV Telugu (@NtvTeluguLive) October 9, 2023
(The above story first appeared on LatestLY on Oct 09, 2023 09:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

