Hyderabad, Oct 9: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (EC) నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ (Five States Election Schedule) విడుదల చేయనుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మీడియా సమావేశంలో ఈ వివరాలు ప్రకటించనుంది. ఈ మేరకు అధికారిక సమాచారాన్ని ఈసీ మీడియాకు వెల్లడించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. ఐదు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగేది? కౌంటింగ్ ఎప్పుడు? అనేది కేంద్రం ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది.
Monocrotophos Banned: మోనోక్రొటోఫాస్ పై కేంద్రం నిషేధం.. మరో మూడు రకాల పురుగు మందులూ బ్యాన్
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది.https://t.co/I9QgQNvIna
— Newsmeter Telugu (@NewsmeterTelugu) October 9, 2023
కౌంటింగ్ ఒకే రోజు
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు ఒకే విడతలో, ఛత్తీస్‌గడ్ లో మాత్రం రెండు విడతలుగా పోలింగ్ జరిగే అవకాశముందని తెలిసింది. నామినేషన్ల ప్రక్రియతో పాటు ఉపసంహరణ గడువు కూడా ఎప్పుడు అనేది నేడు తెలియనుంది. కౌంటింగ్ ఒకే రోజు జరగనుంది.