Hyderabad Gang Rape Case: మియాపూర్‌లో కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్, మూడు రోజుల్లో ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ
హైదరాబాద్‌లోని మియాపూర్ లో రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగిన సంగతి విదితమే. తీవ్ర కలకలం రేపిన మియాపూర్ అత్యాచారయత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) సీరియస్‌గా తీసుకుంది.
Hyd, July 4: హైదరాబాద్‌లోని మియాపూర్ లో రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగిన సంగతి విదితమే. తీవ్ర కలకలం రేపిన మియాపూర్ అత్యాచారయత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) సీరియస్‌గా తీసుకుంది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్.. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు (DGP Ravi gupta) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యపరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో పేర్కొంది. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. ప్రియుడి పురుషాంగాన్ని ప్రియురాలు కట్ చేసిన వీడియో ఇదిగో, బీహార్‌లో పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన మహిళా డాక్టర్
దారుణ దారుణ ఘటన వివరాల్లోకెళితే.. జేఎస్‌ఆర్ గ్రూప్ సన్‌సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి బాధితురాలితో కలిసి సైట్ విజిట్ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్ చేశారు.
ఆమె తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. ఆ కూల్‌డ్రింక్ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్ప్రహ రావడంతో హస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యారు. అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిపై దారుణం, సెక్స్ సమయంలో టైం చూసి ప్రైవేట్ భాగాలను కోసేసిన ప్రియురాలు, రక్తపు మడుగులో ప్రియుడు విలవిలలాడుతుంటే..
అనంతరం ఆ కేసును మియాపూర్ పోలిస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాన్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారిక ప‍్రకటన చేశారు.
(The above story first appeared on LatestLY on Jul 04, 2024 07:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

