Hyderabad Horror: మానవత్వమా? నువ్వెక్కడ? దేశాన్ని కాపాడే జవాన్ రోడ్డుపై తీవ్రగాయాలతో పడిఉన్నా పట్టించుకోని ప్రజలు.. హైదరాబాద్ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై హిట్ అండ్ రన్.. ప్రాణాలు వదిలిన జవాన్ కులాన్ (వీడియో)
హైదరాబాద్ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓ ఆర్మీ జవాన్ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన జవాన్ అక్కడికక్కడే మృతిచెందాడు.
Hyderabad, Mar 5: మానవత్వం మంటగలిసింది. దేశాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయని జవాన్ (Jawan).. రోడ్డుమీద తీవ్ర గాయాలతో పడిఉన్నా ఒక్కరూ స్పందించలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ (Hyderabad) నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం.. ఓ ఆర్మీ జవాన్ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన జవాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. బాధితుడిని రాందేవ్ గూడ ఆర్టిలరీ సెంటర్‌లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్న కులాన్(34)గా గుర్తించారు.
మానవత్వం చచ్చిపోయింది!
ఓ జవాన్ చనిపోయి రోడ్డు మీద ఉన్నా పట్టించుకోని జనం.
హైదరాబాద్ - గోల్కొండ ఆర్టిలరీ కేంద్రంలో విధులు నిర్వహించే ఆర్మీ జవాన్ కునాల్ ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద నిలబడి ఉండగా రెడీ మిక్సర్ వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది.
వాహనదారులు రోడ్డుపై… pic.twitter.com/m2THT6g6k8
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2024
రోడ్డుమీద పడిఉన్నా..
జవాన్ మరణానికి కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు ఆ మార్గంలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా తీవ్ర గాయాలతో కులాన్ రోడ్డుమీద పడిఉన్నా అటువైపు వెళ్తున్న ఏ ఒక్కరూ సాయం చేయకపోవడం కంటతడి పెట్టిస్తున్నది.
(The above story first appeared on LatestLY on Mar 05, 2024 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

