Hyderabad Shocker: జూబ్లీహిల్స్‌లో పబ్‌కి వెళ్లిన బాలిక, కారులోనే అత్యాచారం చేసిన 5 మంది కామాంధులు, నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు, సీసీ టీవీ పుటేజీని స్వాధీనం చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు
పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు.
Hyd, June 2: జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌కి వెళ్లిన బాలికను కారులో తీసుకెళ్లి కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ చెందిన ఒక బాలిక(17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నేషియ ఇన్సోనియా పబ్‌కు స్నేహితులు ఇచ్చిన పార్టీకి గత నెల 28న హాజరైంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒక బెంజి, ఇన్నోవా కార్లలో వచ్చిన కొందరు యువకులు ఆ బాలికను తీసుకెళ్లారు.
ఆ తరువాత రెండు గంటల తరువాత బాలిక తిరిగి వచ్చింది. అయితే.. బాలికతో అసభ్యంగా (17-Year-Old Girl Gang-Raped) ప్రవర్తించారని బాలిక తండ్రి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు (Jubilee Hills Police) ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మెడపై చిన్న గాయం అయ్యిందని, సంఘటన జరిగిన సమయం నుంచి షాక్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేయగా పోలీసులు పొక్సో కింద కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ కేసులో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్న అధికారులు సూరజ్, హాదీలను అదుపులోకి తీసుకుని ఆ కారును స్వాధీనం చేసుకున్నారు.
కాగా గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే రుమేనియా దేశానికి చెందిన బాలిక (17) (17-Year-Old Girl ) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్‌ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదీలతో పాటు మరో యువకుడు బెంజ్ కారును అక్కడే ఉంచి ఇన్నోవా కారులో బాలికను బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు.
ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు హదీ, సూరజ్‌లతో పాటు మరో ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నుంచి వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో ఆ కారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలింది. అక్కడే వదిలేసిన బెంజ్ కారును తీసుకువచ్చి సీజ్ చేశారు. అయితే.. పబ్‌లోకి బాలికను ఎలా అనుమతించారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క నిందితుల్లోనూ ముగ్గురు మైనర్లుగా తెలుస్తోంది. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి కేసును విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే బాధితురాలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తనపై అత్యాచారం జరిగిందంటూ బాలిక స్టేట్‌మెంట్ ఇచ్చింది. గత నెల 28న అమినీషియా పబ్‌లో పార్టీకి వెళ్లగా... సాయంత్రం 5 గంటలకు గుర్తుతెలియని యువకులు.. తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారని తెలిపింది. రాత్రి 7 గంటలకు జూబ్లీహిల్స్ దగ్గర వదిలిపెట్టారని... కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఆమె వెళ్తున్న బెంజ్ కారులో పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు (MLA Son) ఉన్నాడని సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Jun 03, 2022 02:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

