Goa Shocker: నేను బాబాను నీ కోరికలు తీరుస్తానంటూ.., రూంకి పిలిచి బాలికపై అత్యాచారం చేసిన తాంత్రికుడు, సహకరించిన బాలిక తల్లి, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన గోవా పోలీసులు
Representative image

Panaji, June 2: గోవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాంత్రికుడిగా (Man posing as tantrik) చెప్పుకుంటూ ఓ వ్య‌క్తి మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న నార్త్ గోవాలో (Goa Shocker) క‌ల‌కలం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడి (50)తో పాటు అత‌డికి స‌హ‌క‌రించిన బాధితురాలి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం నిందితుడు సోమ‌వారం బాలిక (14)ను త‌న ఇంటికి పిలిపించి ఆమె కోరిక‌లు నెర‌వేరేలా చూస్తాన‌ని మ‌భ్య‌పెడుతూ లైంగిక దాడికి (rapes minor) పాల్ప‌డ్డాడు. ఈ విష‌యంలో నిందితుడికి స‌హ‌క‌రించిన బాధితురాలి త‌ల్లి (43)ని(girl’s mother held for conniving) కూడా అరెస్ట్ చేశామ‌ని డీఎస్పీ జివ్బా ద‌ల్వి తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. నిందితుడిపై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని వెల్ల‌డించారు.

భార్య ఉన్నా పక్కోళ్లతో సెక్స్, కోపం ఆపుకోలేక సుత్తితో మొగుడ్ని చంపించిన భార్య, వికాస్‌ నగర్‌ హత్య కేసును చేధించిన పోలీసులు

నిందితుడు 14 ఏళ్ల బాధిత బాలికను సోమవారం తన నివాసానికి పిలిపించి, ఆమె కోరికలన్నీ తీర్చాలనే నెపంతో అత్యాచారం చేశాడని పోలీసు అధికారి వెల్లడించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (మపుసా) జీవ్బా దాల్వి మాట్లాడుతూ, నిందితుడితో కలిసి 43 ఏళ్ల మైనర్ తల్లిని కూడా అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. బాధితురాలి తండ్రి నిందితులపై ఫిర్యాదు చేయగా, తివిమ్ ప్రాంతంలోని కాన్సా గ్రామంలో అరెస్టు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 376 (రేప్), లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం, గోవా బాలల చట్టం, 2003 కింద అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. .