Representational Image | (Photo Credits: IANS)

Delhi, May 26: ఢిల్లీలో కలకలం సృష్టించిన వికాస్‌ నగర్‌ హత్య కేసు( Vikas Nagar Murder Case) ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మృతుడి రెండో భార్య చంద్ర కళ(28).. సుపారీ రౌడీతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు తమ పరిశోధనలో నిర్ధారించారు. భార్యే ..మొగుడ్ని హత్య చేయించి (woman hires man to murder husband) దోపిడీహత్యగా చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలిపారు.

ఘటన వివరాల్లోకెళితే.. మృతుడు వీర్‌ బహదూర్‌ వర్మ(50) వికాస్‌ నగర్‌లో ఓ బట్టల దుకాణం నడుపుతున్నాడు. కొన్నినెలల కిందట ఆ షాపులోనే పని చేసే చంద్రకళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబంతో రాజీ చేసుకున్న వర్మ.. ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న వర్మను గత్యంతరం లేని పరిస్థితుల్లో భర్తగా అంగీకరించింది ఆమె. అయితే పెళ్లి అయ్యాక తనతో సవ్యంగా ఉంటాడని భావించిన ఆమెకు.. నిరాశే ఎదురైంది. పైగా వ్యభిచార గృహాల చుట్టూ తిరగడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో వర్మ ప్రవర్తనతో విసిగిపోయింది.

ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు సైతం జరిగాయి. ఈ పరిస్థితుల మధ్య కొన్నివారాల కిందట.. కళ సోదరి ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపైనా వర్మ కన్నేశాడు. ఇది పసిగట్టిన కళ.. మొగుడి ఆగడాల్ని భరించలేకపోయింది. కిరాయి హంతకుడి సాయంతో మొగుడ్ని చంపేందుకు ప్లాన్‌ వేసింది. రణ్‌హోలాకు (Delhi's Ranhola area) చెందిన రౌడీ షీటర్‌ జుమ్మాన్‌ను కలిసి డీల్ మాట్లాడుకుంది. హత్య కోసం లక్షన్నర డబ్బుతో పాటు ఓ సుత్తిని కూడా అందించింది. ఆ సుత్తితోనే మొగుడ్ని చంపేయాలని కోరింది.

భార్య స్నేహితురాలిపై భర్త కన్ను, విషయం తెలిసి భర్త తలను నరికి నదిలో పడేసిన భార్య, ఆమె ఫ్రెండ్, ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో దారుణ ఘటన

ఈ క్రమంలో.. మే 18వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చంద్రకళ సాయంతో.. సుత్తితో వర్మపై దాడి చేశాడు జుమ్మాన్‌. అనంతరం శవాన్ని రోడ్డు మీద పడేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వర్మను.. డీడీయూ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. భర్త హత్యను దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది చంద్రకళ. ఇందుకోసం ఇంట్లోని డబ్బు, నగదును జుమ్మాన్‌కు ఇచ్చి పంపించి వేసింది. కేసు వివరాలను ఢిల్లీ పోలీసులు మీడియాకు తెలిపారు.