Hyderabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో.. ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ సిబ్బందిపై కర్రలతో దాడి.. హైదరాబాద్ హోటల్‌లో రౌడీల వీరంగం
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోటల్‌లో గది కోసం వచ్చిన కొందరు వ్యక్తులను. నియమాల ప్రకారం ఐడీ ప్రూఫ్ అడిగిన పాపానికి హోటల్ సిబ్బందిపై నడిరోడ్డుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఈ దారుణ సంఘటన నగరంలోని భరత్‌నగర్ పరిధిలో ఉన్న 'లివింగ్ ట్రీ సూట్స్' అనే హోటల్ వద్ద చోటుచేసుకుంది.
Hyderabad Shocker: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోటల్‌లో గది కోసం వచ్చిన కొందరు వ్యక్తులను. నియమాల ప్రకారం ఐడీ ప్రూఫ్ అడిగిన పాపానికి హోటల్ సిబ్బందిపై నడిరోడ్డుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఈ దారుణ సంఘటన నగరంలోని భరత్‌నగర్ పరిధిలో ఉన్న 'లివింగ్ ట్రీ సూట్స్' అనే హోటల్ వద్ద చోటుచేసుకుంది.
హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవడానికి వచ్చిన కొందరు వ్యక్తులను, నిబంధనల ప్రకారం ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు) చూపించాలని అక్కడ పనిచేస్తున్న ఆకాష్ అనే హోటల్ సిబ్బంది కోరారు. దానికి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తులు మేము లోకల్.. మమ్మల్నే ఐడీ ప్రూఫ్ అడుగుతావా అంటూ సిబ్బందిపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.
అంతటితో ఆగకుండా, ఆకాష్‌ను బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపైనే కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆకాష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న అతడిని తోటి ఉద్యోగులు వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
CCTV Captures Violent Attack on Hotel Employees in Hyderabad
హైదరాబాద్ నగరంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు..
భరత్‌నగర్‌లో నడిరోడ్డుపై కర్రలతో రెచ్చిపోయిన దుండగులు
ఓయో లివింగ్ ట్రీ సూట్స్ హోటల్‌లో రూమ్ కోసం వచ్చి సిబ్బందిపై దాడి చేసిన ఉన్మాదులు
"మేము లోకల్.. మమ్మల్నే ఐడీ ప్రూఫ్స్ అడుగుతావా" అంటూ హోటల్ ఉద్యోగిపై విరుచుకుపడ్డ ఆకతాయిలు… pic.twitter.com/nfJGpIGVoI
— RTV (@RTVnewsnetwork) August 5, 2026
హైదరాబాద్ నగరంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు..
భరత్‌నగర్‌లో నడిరోడ్డుపై కర్రలతో రెచ్చిపోయిన దుండగులు
ఓయో లివింగ్ ట్రీ సూట్స్ హోటల్‌లో రూమ్ కోసం వచ్చి సిబ్బందిపై దాడి చేసిన ఉన్మాదులు
"మేము లోకల్.. మమ్మల్నే ఐడీ ప్రూఫ్స్ అడుగుతావా" అంటూ హోటల్ ఉద్యోగిపై విరుచుకుపడ్డ ఆకతాయిలు… pic.twitter.com/jfunP6nRRi
— citizenspulse (@citizenspulse01) August 5, 2026
ఈ దాడి సంఘటనపై హోటల్ యాజమాన్యం, బాధితుడి తోటి ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 05, 2026 12:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

