Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

హైదరాబాద్‌లో ఓ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నగరంలోని వారాసిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఘటన చోటు చేసుకుంది.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు
Suicide (Photo Credits: Twitter)

హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్‌లో ఓ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నగరంలోని వారాసిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రకళ, సాయికృష్ణ దంపతులకు ఆరేళ్ల కుమార్తె చిట్టి ఉంది. చిత్రకళ బిర్లా సైన్స్‌ సెంటర్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

సాయికృష్ణ ప్రైవేటు ఉద్యోగి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసిన దంపతులు.. అనంతరం వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు వారి మృతికి గల కారణాలను ఇంట్లోని గోడపై రాశారు. గోడపై పలువురి పేర్లు రాసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దంపతులిద్దరి ఉద్యోగాలు పోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ముంబైలో దారుణం, డాక్టర్‌కు మందు తాగించి సృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం, అనంతరం డబ్బు కోసం బ్లాక్ మెయిల్

ఆంద్రప్రదేశ్‌కు చెందిన ఈ దంపతులు తీవ్ర చర్య తీసుకోవడానికి గల కారణాన్ని గోడలపై రాశారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో చిత్రకళను ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం నుంచి తొలగించారు.తనకు అన్యాయం జరిగిందని, ఉన్నత స్థాయిలో విన్నవించినా న్యాయం జరగలేదని ఆమె ఆరోపించారు. సాయికృష్ణ యాప్ ఆధారిత సర్వీస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Nov 17, 2023 02:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).