Hyderabad Shocker: ప్రేమించలేదని బరితెగించిన ప్రేమోన్మాది, యువతి కళ్లలో కారం చల్లి,గొంతు కోసేందుకు ప్రయత్నం, స్థానికులు అడ్డుకోవడంతో పరార్
హైదరాబాద్‌లోని బోరబండలో గల బంజారానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషోర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు
Hyd, April 24: హైదరాబాద్‌లోని బోరబండలో గల బంజారానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషోర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు. అయితే యువకుడి ప్రేమను లక్ష్మీ నిరాకరించింది.ఈ క్రమంలో సోమవారం నడుచుకుంటూ వెళ్తున్న యువతిని అడ్డగించిన కిషోర్.. ఆమె కళ్లలో కారం పొడి పోసి, కత్తితో దాడి చేశాడు. దీంతో లక్ష్మీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది ప్రేమోన్మాదిని అడ్డుకున్నారు.
నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని చితకబాదిన స్థానికులు.. ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Apr 24, 2023 08:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

