Hyderabad vs Bengaluru: హైదరాబాద్ vs బెంగుళూరు, డీకే శివకుమార్ మంత్రి కేటీఆర్ మధ్య ఐటీ గురించి ఆసక్తికర ఛాలెంజ్ చర్చ
మంత్రి కేటీఆర్, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. బెంగుళూరులో మౌళిక సదుపాయాలు సరిగా లేవని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్ సీఈవో తన ట్విట్టర్ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు.
Hyd,April 4: మంత్రి కేటీఆర్, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. బెంగుళూరులో మౌళిక సదుపాయాలు సరిగా లేవని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్ సీఈవో తన ట్విట్టర్ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు. దానికి మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. మీరంతా హైదరాబాద్‌కు రావొచ్చు అని, ఇక్కడ ఉత్తమ సదుపాయాలున్నట్లు ట్వీట్ చేశారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్‌పై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు.
అయితే ఆ ట్వీట్‌కు ఇవాళ కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. మీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని, 2023లో కర్నాటకలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మళ్లీ బెంగుళూరుకు పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకురానున్నట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. శివకుమార్ అన్నా.. కర్నాటక రాజకీయాల గురించి అంతగా తెలియదని, అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేనని, కానీ మీరు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశంలో కొనసాగుతున్న పెట్రో బాదుడు, తాజాగా 40 పైసలు పెంపు, గత 14 రోజుల వ్యవధిలో 12 సార్లు ఇంధన ధరలు పెంపు
Dear @DKShivakumar Anna, I don’t know much about politics of Karnataka & who will win but challenge accepted👍
Let Hyderabad & Bengaluru compete healthily on creating jobs for our youngsters & prosperity for our great nation
Let’s focus on infra, IT&BT, not on Halal & Hijab https://t.co/efUkIzKemT
— KTR (@KTRTRS) April 4, 2022
దేశ యువత, సౌభాగ్యం కోసం ఉద్యోగాల కల్పన ద్వారా హైదరాబాద్, బెంగుళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌళిక సదుపాయాల కల్పన, ఐటీ, బీటీలపై ఫోకస్ పెడుదామని, కానీ హలాల్, హిజాబ్ లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు.
(The above story first appeared on LatestLY on Apr 04, 2022 03:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

