Hyderabad Shocker: ఆన్‌లైన్ ప్రేమ, కోరిక తీర్చాలని ప్రియుడు వేధింపులు, లేదంటో ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు, హైదరాబాద్‌లో ఘటన

ఆన్‌లైన్ ప్రేమలు కొంపలు కూల్చుతున్నాయి. కూల్చడమూ కాదు ఏకంగా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో ప్రేమికుడి లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య (Woman dies by suicide) చేసుకుంది.

Hyderabad Shocker: ఆన్‌లైన్ ప్రేమ, కోరిక తీర్చాలని ప్రియుడు వేధింపులు, లేదంటో ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు, హైదరాబాద్‌లో ఘటన
Representational Image (Photo Credits: File Image)

Hyderabad, June 26: ఆన్‌లైన్ ప్రేమలు కొంపలు కూల్చుతున్నాయి. కూల్చడమూ కాదు ఏకంగా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో ప్రేమికుడి లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య (Woman dies by suicide) చేసుకుంది. జూబ్లీహిల్స్‌ పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌లో ఉండే ఇంటర్‌ విద్యార్థిని(16)కి నెల రోజుల క్రితం మెహిదీపట్నానికి చెందిన విద్యార్థి సమద్‌(22)తో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది.

అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా సమద్‌ ప్రేమ ముసుగులో బాలికను లైంగికంగా లోబర్చుకొనేందుకు యత్నిస్తుండగా నిరాకరిస్తూ వచ్చింది.తనతో రాకపోతే ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. అతడి వేధింపులతో శుక్రవారం తెల్ల వారుజామున బాలిక తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఫస్ట్ నైట్‌ కాలేదేమో..రెండు నెలలకు తన భార్య హిజ్రా అని తెలిసింది, లబోదిబోమంటూ అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, యూపీలోని కాన్పూర్‌లో ఘటన

సమద్‌ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా బాలిక సూసైడ్‌ నోట్‌ రాసింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 26, 2021 12:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).