
Kanpur, June 23: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న యువకుడికి తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి మహిళ కాదు.. ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలిసి షాక్ తిన్నాడు. పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత తన భార్య హిజ్రా (Two Months After Marriage, Man Learns ‘Wife’ is a Transgender) అని తెలిసి లబోదిబోమన్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో చోటు చేసుకుంది.
అతను పోలీసులను ఆశ్రయించడంతో (Files Case Against in-laws for ‘Duping’ Him) ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతినిఈ ఏడాది ఏప్రిల్ 28న వివాహమాడాడు. అయితే తొలి రాత్రి బాలేదని దూరం పెట్టింది. తనను తాను సర్ది చెప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత నుంచి భార్య అతడికి దూరంగా ఉండసాగింది. ఎన్ని సార్లు దగ్గరవుదామని ప్రయత్నించినా.. ఏదో ఓ కారణం చెప్పి అతడిని దూరం పెట్టసాగింది.
గట్టిగా అడిగితే.. ఆరోగ్యం బాగాలేదని తెలిపేది. పెళ్లై రెండు నెలలు గడుస్తున్నా.. భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సదరు వ్యక్తిలో అనుమానం మొదలయ్యింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా షాకింగ్ విషయం తెలిసింది. సదరు వ్యక్తి భార్య అసలు మహిళే కాదని.. ట్రాన్స్‌జెండర్ అని తెలిపారు వైద్యులు. మోసపోయానని తెలుసుకున్నాడు. తన భార్య లింగమార్పిడి చేయించుకుందని, ఆమె జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని వైద్యులు తెలిపారు.
మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. లింగమార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి తనతో వివాహం జరిపించారని, మోసం చేసిన అత్తమామలపై కేసు పెట్టాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన భార్య వైద్య నివేదికతో వధువు, ఆమె తల్లిదండ్రులు, వివాహ మధ్యవర్తిపై భర్త ఫిర్యాదు చేయడంతో వారిపై తాము ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ చెప్పారు.