Shock to Hero Nagarjuna: హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
Hyderabad, Aug 24: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు (Hero Nagarjuna) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నది. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను కబ్జా చేసి నాగార్జున ఎన్-కన్వెన్షన్ హాల్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎన్-కన్వెన్షన్ నిర్మాణం అక్రమమని తేల్చిన అధికారులు నేటి ఉదయం కూల్చివేత పనులు ప్రారంభించారు.
హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా
హైదరాబాద్ - మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం.. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తిమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు..
మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్… pic.twitter.com/zAAXVRpYku
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2024
గతంలో ఆగిపోయి..
హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలిగింపు పైన దూకుడుగా వ్యవహరిస్తున్నది. . కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. కాగా, నాగార్జున ఎన్-కన్వెన్షన్ సెంటర్ పై గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా..అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా..చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి.
(The above story first appeared on LatestLY on Aug 24, 2024 12:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

