KA Paul (Credits: Twitter)

Munugode, October 29: మునుగోడులో (Munugode) ఉప ఎన్నికల (By-Elections) సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజాశాంతి పార్టీ (Prajashanthi) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ప్రచారంలో ఊపు పెంచారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళుతున్నారు. నిన్న  ఆయన రైతు వేషం వేశారు. కండువాను తలకు కట్టుకున్న ఆయన, బనియన్, పంచెతో దర్శనమిచ్చారు. అంతేకాదు, సైకిల్ తొక్కుతూ పొలంబాట పట్టారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ మిషన్ బట్టల్ని కాదు, మనుషుల్ని ఉతుకుతుంది! జపాన్ సైంటిస్టులు కొత్త సృష్టి, మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మిషన్ టెస్టింగ్, త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి....ఎలా పనిచేస్తుందో తెలుసా?

తన మాటలు, హావభావాలతో రైతులను నవ్వించారు. రైతులతో కలిసి పత్తి ఏరారు. ఇవాళ కేఏ పాల్ ప్రచారం చండూరు పరిధిలో సాగింది. అటు, బనియన్, పంచె, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ తో వాహనం నుంచి కూడా ఆయన ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.