Human Washing Machine: ఈ మిషన్ బట్టల్ని కాదు, మనుషుల్ని ఉతుకుతుంది! జపాన్ సైంటిస్టులు కొత్త సృష్టి, మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మిషన్ టెస్టింగ్, త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి....ఎలా పనిచేస్తుందో తెలుసా?
Credit@ Google

Tokyo, OCT 28: బట్టల్ని ఉతకడానికి వాషింగ్ మెషీన్ (Washing Machine) ఉంది. మరి మనుషుల్ని ఉతకడానికి కూడా వాషింగ్ మిషిన్ ఉంటుందా? అనే అనుమానం ఎవరికో ఒకరికి వచ్చే ఉంటుంది. మన దేశంలో ఇలాంటి ఆలోచనలు చాలా మట్టుకు ఆలోచన వరకే ఆగిపోతాయి. కానీ, ఇవే ఆలోచనలు జపాన్ (Japan) వాళ్లకు వస్తే.. వెంటనే ఆ ఆలోచన కాస్త ఆచరణగా మారుతుంది. అలాంటి ఆలోచన నుంచి వచ్చిందే ఈ కొత్త వాషింగ్ మెషీన్. మరి వాషింగ్ మేషీన్ అంటే.. బట్టల్ని ఉతికేసినట్లు మనుషుల్ని కూడా ఉతికేస్తుందా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సున్నితంగా, శుభ్రంగా స్నానం చేయిస్తుందని తయారీ దారులు చెబుతున్నారు. అయితే ఈ వాషింగ్ మెషీన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం తయారీలోనే ఉందని జపనీస్ కంపెనీ ఒసాకాకు చెందిన ‘సైన్స్ కో లిమిటెడ్’ పేర్కొంది.

Viral Video: మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో కుమ్ములాట, అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్న వీడియోలు వైరల్ 

ఫైన్ బబుల్ టెక్నాలజీతో పాటు వివిధ సెన్సార్లు (Sensors), కృత్రిమ మేధ ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుందట. అంతే కాదు, ఆ సమయంలో మనుసుకు ఆహ్లాదం కలిగేలా సంగీతం కూడా వినిపిస్తుందని అంటున్నారు. ఇక ఈ మెషీన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోని సెన్సార్లు నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో.. అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు.

WhatsApp Services Restored: హమ్మయ్యా..తిరిగి పనిచేస్తున్న వాట్సాప్, ఊపిరి పీల్చుకున్న యూజర్లు, దాదాపు రెండు గంటల పాటు పనిచేయని వాట్సాప్ సేవలు 

అయితే ఇలాంటి వాషింగ్ మెషీన్ ఆలోచన ఇప్పుడు కొత్తేం కాదు. జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ 1970 సమయంలోనే అల్ట్రాసోనిక్ బాత్ అనే పరికరాన్ని తయారు చేసింది. 15 నిమిషాల్లో శరీరాన్ని శుభ్రం చేయడంతో పాటు ఆరబెట్టడం, మసాజ్ చేయడం కూడా పూర్తి చేస్తుంది. కాకపోతే, అనేక సందేహాల కారణంగా మార్కెట్లోకి రాలేదు.