Marredpally Inspector Suspended: తుపాకీతో బెదిరించి భర్తముందే అత్యాచారం చేసిన సీఐ, వెంటనే సస్పెండ్ చేసి సీపీ, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం, బయటకు వస్తున్న మారేడ్‌ పల్లి సీఐ అఘాయిత్యాలు
Representational image (Photo Credit: File Photo)

Hyderbad, July 09: చట్టాన్ని కాపాడాల్సిన ఇన్‌ స్పెక్టర్...ఓ మహిళను బెదిరించి అత్యాచారానికి (rape)పాల్పడ్డాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. మారేడుపల్లి సీఐగా(maredpally CI) ఉన్న నాగేశ్వరరావుపై (nageswar rao) వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేశారు. అత్యాచారం, ఆయుధ చ‌ట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు న‌మోదైన‌ట్లు రాచ‌కొండ సీపీ (Rachkonda CP) నుంచి హైద‌రాబాద్ సీపీ కార్యాల‌యానికి స‌మాచారం అందింది. దీంతో నాగేశ్వర్ రావును విధుల నుంచి త‌ప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బ‌క్రీదు, బోనాల పండుగ బందోబ‌స్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుప‌ల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ (CV Anand) నియ‌మించారు. బాధితురాలి భ‌ర్తపై కూడా సీఐ నాగేశ్వర్ రావు దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వర్ రావుపై అత్యాచారం, కిడ్నాప్ (Kidnap) ఆరోప‌ణ‌ల‌తో కేసు నమోదైంది. సీఐ నాగేశ్వర్ రావును వ‌న‌స్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశం ఉంది.

Jharkhand Girl Raped: నోట్ బుక్‌ కోసం వెళ్తున్న ఆరో తరగతి బాలిక కిడ్నాప్, అత్యాచారం, అడ్రస్ కోసమని పిలిచి కారులో లాక్కెల్లిన దుండగులు, జార్ఖండ్‌ లో ఘటన, బాలిక పరిస్థితి విషమం 

వివ‌రాల్లోకి వెళ్తే.. నాగేశ్వర్ రావు (Nageswara rao) ఈ నెల 7వ తేదీన హ‌స్తినాపురం శ్రీ వెంక‌టేశ్వర కాల‌నీలో నివాస‌ముంటున్న ఓ మ‌హిళ ఇంటికి వెళ్లాడు. రాత్రి స‌మ‌యంలో భ‌ర్త ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వెంట‌నే వారి ఇంట్లోకి సీఐ ప్రవేశించాడు. భ‌ర్త తిరిగొచ్చే వ‌ర‌కు భార్యపై సీఐ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు.

MP Shocker: భర్త పాడు బుద్ది, భార్యతో అసహజ సెక్స్, ఆ తర్వాత రూ. కోటి ఇవ్వాలని బ్లాక్ మెయిల్, లేకుంటే వీడియోలు సోషల్ మీడియోలో షేర్ చేస్తానంటూ భార్యకు బెదిరింపులు 

త‌న భార్యపై అత్యాచారం చేస్తున్న సీఐని అడ్డుకున్నాడు. దీంతో బాధితురాలి భ‌ర్తను సీఐ రివాల్వర్‌తో బెదిరించాడు. అర్ధరాత్రి స‌మ‌యంలో ఆ దంప‌తులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంప‌ట్నం వైపు బ‌య‌ల్దేరాడు. అయితే కారు రోడ్డుప్రమాదానికి గుర‌వ‌డంతో.. సీఐ నుంచి దంప‌తులిద్దరూ త‌ప్పించుకుని, వ‌న‌స్థలిపురం పోలీసుల‌ను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీఐ నాగేశ్వర్ రావును వ‌న‌స్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశం ఉంది.