Medchal Shocker: మద్యం తాగవద్దన్న తండ్రి, కోపంతో దారుణంగా చంపేసిన కొడుకు, కర్రతో తండ్రి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి, మేడ్చల్ పరిదిలోని నూతన్‌కల్‌ మండలం లింగంపల్లి గ్రామంలో దారుణ ఘటన

తెలంగాణలో మేడ్చల్ జిల్లా నూతన్‌కల్‌ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో దారుణ ఘటన (Medchal Shocker) చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు ఓ తనయుడు తండ్రిని దారుణంగా హత్య (Son Assassinated His Father,) చేశాడు

Medchal Shocker: మద్యం తాగవద్దన్న తండ్రి, కోపంతో దారుణంగా చంపేసిన కొడుకు, కర్రతో తండ్రి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి, మేడ్చల్ పరిదిలోని నూతన్‌కల్‌ మండలం లింగంపల్లి గ్రామంలో దారుణ ఘటన
Image used for representational purpose only. | File Photo

Medchal, April 21: తెలంగాణలో మేడ్చల్ జిల్లా నూతన్‌కల్‌ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో దారుణ ఘటన (Medchal Shocker) చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు ఓ తనయుడు తండ్రిని దారుణంగా హత్య (Son Assassinated His Father,) చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పుల వెంకన్న(50) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు మల్లయ్య తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు. కాగా, మల్లయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు.

ఇదే విషయంపై తండ్రికొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కుమారుడు తాగి (Father Advised Him Not To Drink) రావడంతో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వెంకన్న తలపై మల్లయ్య కర్రతో దాడిచేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంకన్నకు ఎలాంటి వైద్యచికిత్స అందించకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

ఆటోడ్రైవర్‌పై 7గురు ట్రాన్స్‌జెండర్ల అరాచకం, రూ. 1000 డబ్బులు తీసుకుని పరార్, అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు, ఐపీసీ 341,384,504,506 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు

మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు సీఐ రవి పర్యవేక్షణలో ఎస్‌ఐ శివకుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Apr 21, 2021 11:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).