Hyderabad, April 20: ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రయాణికులను బెదిరించి అందినకాడికి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులను అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్న ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అరెస్ట్ (Transgenders Booked for Extortion) చేశారు. తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ (Banjara Hills police ) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటన వివరాల్లోకెళితే.. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్టకు చెందిన మహ్మద్ రహీం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18న జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఇందిరానగర్ వైపు తన ఆటోలో వెళ్తుండగా కొందరు ట్రాన్స్‌జెండర్లు ( seven transgenders,) అడ్డుకున్నారు. అతడి ప్రమేయం లేకుండా జేబులో నుంచి వెయ్యి రూపాయలు లాక్కున్నారు. డబ్బు తిరిగి ఇచ్చేయాలని రహీం కోరగా దుర్భాషలాడారు. దీంతో రహీం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గతంలో ఇలాంటివి అనేక ఫిర్యాదులు రావడంతో బంజారా హిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రహీం వద్ద డబ్బులు లాక్కున ఇందిరానగర్‌కు చెందిన సీహెచ్ నిత్య, ఎస్.స్వీటి అలియాస్ నరేంద్ర, బి.శైలు, ఎస్.ఫాతీమా, ఎం.ప్రియ, ఎండీ సిమ్రాన్ ఫాతిమా, దీక్ష అలియాస్ లడ్డును అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 341,384,504,506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుమని సీఐ శివచంద్ర తెలిపారు.