File (Credits: Twitter)

Hyderabad, Dec 5: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సీబీఐ (CBI) అధికారులు పంపిన ఎఫ్ఐఆర్ (FIR) లో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (TRS MLC Kavitha) లేఖ రాశారు. ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో, రేపటి విచారణకు తాను హాజరుకాలేనని ఆమె తెలిపారు.

కింగ్ కోబ్రాకి స్నానం చేయిస్తున్న వీడియో వైరల్, ఎటువంటి భయం లేకుండా భారీ కింగ్ కోబ్రాకు స్నానం చేయించిన దాని యజమాని

ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తన నివాసంలో (My Residency) విచారణ జరపవచ్చని చెప్పారు. విచారణకు సహకరిస్తానని తెలిపారు. దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. విచారణ కోసం సీబీఐ పంపిన లేఖను ఉద్దేశిస్తూ ఇంతకు ముందే కవిత సీబీఐకి తొలి లేఖ రాశారు. ఐఎఫ్ఐఆర్ కాపీ తనకు పంపాలని... ఆపై విచారణ తేదీని ఖరారు చేయవచ్చని చెప్పారు.

మధ్యప్రదేశ్ లో జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్.. ఏడుగురి మృతి... ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

ఐఎఫ్ఐఆర్ కాపీ సీబీఐ వెబ్ సైట్ లో ఉన్నదని అధికారులు బదులిచ్చారు. వాటిని పరిశీలించిన కవిత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని సీబీఐకి తాజాగా రెండో లేఖ రాశారు.