Telangana Rains: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన వర్షాలు, నేడు రేపు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి దంచికొడుతున్న వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు (Monsoon Rains) నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది

Telangana Rains: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన వర్షాలు, నేడు రేపు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Heavy rains (Photo-ANI)

Hyd, July 15: తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి దంచికొడుతున్న వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు (Monsoon Rains) నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్లా భారీ వర్షాలు పడ్డాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల వర్షాలు తెరిపినిచ్చాయి.

ఇక శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. అయితే ఏ జిల్లాకు కూడా రెడ్‌ అలర్ట్‌ జారీ చేయలేదు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను (yellow alert in 9 districts) ప్రకటించింది. ఒడిశా, కోస్తాంధ్ర పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో మూడు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది.

అంతా రామయ్యపైనే భారం, గోదావరి ఉగ్రరూపంతో డేంజర్ జోన్లో భద్రాచలం, సాయంత్రం నుంచి రాకపోకలు బంద్, 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు

అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఏటా నైరుతి సీజన్‌లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అందులో జూలై 14కి 22.66 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి ఏకంగా 52.49 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. అంటే మొత్తం నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే వర్షంలో మూడింట రెండొంతులు ఇప్పటికే కురిసినట్టు తెలిపింది.

(The above story first appeared on LatestLY on Jul 15, 2022 10:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).