Munugodu Bypoll: కేసీఆర్‌ వ్యాఖ్యలకు రేపు ధీటైన కౌంటర్ వేయనున్న అమిత్ షా, మునుగోడులో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ, హాజరుకానున్న హోం మంత్రి, బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న కోమటిరెడ్డి

తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌ (Munugodu Bypoll) నేప‌థ్యంలో బీజేపీ రేపు (ఆదివారం) మునుగోడులో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఈ స‌భ‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Munugodu Bypoll: కేసీఆర్‌ వ్యాఖ్యలకు రేపు ధీటైన కౌంటర్ వేయనున్న అమిత్ షా, మునుగోడులో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ, హాజరుకానున్న హోం మంత్రి, బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న కోమటిరెడ్డి
Amit Shah reaches Kolkata amid black flag protest by Left, Cong (Photo-ANI)

Hyd, August 20: తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌ (Munugodu Bypoll) నేప‌థ్యంలో బీజేపీ రేపు (ఆదివారం) మునుగోడులో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఈ స‌భ‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మ‌క్షంలో కోమ‌టిరెడ్డి బీజేపీలో చేర‌నున్నారు. ఈ స‌భ కోసం తెలంగాణ రానున్న అమిత్ షా టూర్ షెడ్యూల్ ఈ విధంగా వుంది.

ఢిల్లీ నుంచి బ‌య‌లుదేర‌నున్న అమిత్ షా రేపు (home Minister Amit Shah To Visit Telangana) మ‌ద్యాహ్నం 3.40 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్క‌డి నుంచి నేరుగా బ‌య‌లుదేర‌నున్న ఆయ‌న సాయంత్రం 4.30 గంట‌ల‌కు మునుగోడు చేరుకుంటారు. ఆ వెంట‌నే అక్క‌డే సీఆర్పీఎఫ్ అధికారుల‌తో ఆయ‌న భేటీ అవుతారు. అనంత‌రం మునుగోడులో బీజేపీకి చెందిన ఓ దళిత కార్య‌క‌ర్త ఇంటిలో ఆయ‌న భోజ‌నం చేయ‌నున్నారు.

మోదీ దోస్తులు సూట్‌ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు, నీళ్ల వాటా ఇవ్వనందుకే మునుగోడు వస్తున్నవా అమిత్ షా.. కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

ఈ తర్వాత అక్క‌డే రైతుల‌తో మాట్లాడ‌నున్న షా... అనంతరం మునుగోడు బ‌హిరంగ స‌భ‌లో (Address Public Meeting in Munugodu ) ప్ర‌సంగిస్తారు. స‌భ ముగిసిన త‌ర్వాత తిరిగి రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో శంషాబాద్ చేరుకోనున్న అమిత్ షా... ఓ గంటన్న‌ర‌ పాటు నోవాటెల్ హోట‌ల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంత‌రం రాత్రి 9.30 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయ‌న ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ‌తారు.

(The above story first appeared on LatestLY on Aug 20, 2022 09:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).