 
                                                                 Hyderabad, April 14: హైదరాబాద్ సనత్ నగర్‌లో దారున ఘటన చోటు చేసుకుంది. బ్యాచిలర్స్ రూంలో ఉంటున్న ఇద్దరు స్నేహితుల మధ్య కూరగాయలు కట్ చేయడంలో గొడవలు రావడంతో ఓ స్నేహితుడు మరో స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక హెచ్‌పీ రోడ్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైతాస్ ఆలి సల్మాన్, ఫిరోజ్ ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలల నుంచి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
మంగళవారం రాత్రి 10:30 సమయంలో గదికి వారిద్దరు వచ్చారు. వంట కోసం కూరగాయలు కట్ చేసి ఇవ్వమని మైతాస్ ఆలి కోరగా సల్మాన్ ఫిరోజ్ పట్టించుకోలేదు. దీంతో కూరగాయలు కట్ చేసే కత్తితో సల్మాన్ ఫిరోజ్‌పై దాడి చేశాడు. దీంతో ఫిరోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఫిరోజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
