Jagadgirigutta Shocker: ఆన్‌లైన్‌ క్లాస్‌..బాలిక నోరు నొక్కేసి అత్యాచారం, ఆపై వీడియో తీసి పలుమార్లు లైంగిక దాడి చేసిన ఇంటి ఒనర్ కొడుకు, జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో దారుణ ఘటన

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధి జగద్గిరిగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై ఇంటి యజమాని కుమారుడు లైంగిక దాడికి (house owner son molestation minor girl) పాల్పడ్డాడు.

Jagadgirigutta Shocker: ఆన్‌లైన్‌ క్లాస్‌..బాలిక నోరు నొక్కేసి అత్యాచారం, ఆపై వీడియో తీసి పలుమార్లు లైంగిక దాడి చేసిన ఇంటి ఒనర్ కొడుకు, జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో దారుణ ఘటన
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Hyderabad, April 14: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధి జగద్గిరిగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై ఇంటి యజమాని కుమారుడు లైంగిక దాడికి (house owner son molestation minor girl) పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని ( hyderabad jagadgiri gutta) ఎల్లమ్మబండకు చెందిన బాలిక (15), తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా.. ఇంట్లో ఆన్‌లైన్‌ క్లాసులు వింటూ ఒంటరిగా ఉంటున్నది. అదే క్రమంలో ఇంటి యజమాని కుమారుడు మధుసూదన్‌ రెడ్డి (27) బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు.

దీనిని వీడియోలో చిత్రీకరించాడు. విషయం ఎవరికైనా చెబితే సోషల్‌ మీడియాలో పెడతానని బాలికను భయపెట్టాడు. దాన్ని అడ్డం పెట్టుకుని అనేకసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మనోవేదనకు గురైన బాలిక ఈనెల 12న విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. సకాలంలో గమనించిన తల్లిదండ్రులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాస్త తేరుకున్నాక ఎందుకిలా చేశావని తల్లిదండ్రులు ప్రశ్నించగా బాధితురాలు జరిగిన విషయమంతా చెప్పి బోరుమంది. దీంతో వారు వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేపట్టారు.

తొమ్మిది మంది భార్యలతో ఎంజాయ్, చివరకు రెండో భార్య కొడుకు చేతిలో చావుకు దగ్గరగా వెళ్లాడు, మదనపల్లెలో ఘటన, కేసు దర్యాప్తు చేస్తున్న మదనపల్లె పోలీసులు

ఇక హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో మరో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో మరదల్ని హత్య చేశాడో బావ. కూకట్‌పల్లి ఏవీబీపురంలో నివాసం ఉంటున్న భూపతి అనే వ్యక్తి మరదలిపై అనుమానంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. పెళ్లి చేసుకోవాల్సిన తనతో కాకుండా ఇతరులతో తిరుగుతోందని అనుమానించి హత్య చేశాడు. అనంతరం శవాన్ని నీటి సంపులో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే చావటానికి ధైర్యం చాల్లేదు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

 

(The above story first appeared on LatestLY on Apr 14, 2021 11:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).