Image used for representational purpose only | (Photo Credits: PTI)

Madanapalle, April 13: చనిపోయిన మృతదేహాలను ఖననం చేస్తూ జీవితం గడిపే ఓ వ్యక్తికి తొమ్మిది మంది భార్యలు అంటే నమ్మగలరా..ఈ స్టోరి చదివిన తర్వాత నమ్మాల్పిందే.. చివరకు అతను రెండో భార్య కొడుకు చేతిలో చావుకు దగ్గరగా వెళ్లాడు, ఈ ఘటన ఏపీలోని మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లె టూ టౌన్‌ సీఐ నరసింహులు, ఎస్‌ఐ బాబు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా చలపతిరావు కాలనీకి చెందిన కుందాని భాస్కర్‌ అలియాస్‌ శవాల భాస్కర్‌ చనిపోయిన మృతదేహాలను తీసుకెళ్లి ఖననం చేస్తూ జీవితం సాగిస్తున్నారు.

ఇతనికి 9 మంది భార్యలు, 14 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఎనిమిదవ భార్య ఉషారాణిని 12 ఏళ్ల క్రితం హత్య చేసి భాస్కర్‌ జైలుకు వెళ్లాడు. కొంతకాలానికి బయట కొచ్చిన అతను కలకడకు చెందిన ఆదెమ్మను తొమ్మిదో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కలకడకే మకాం మార్చి గుజిరీ సేకరించి వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాడు. అయితే కన్నబిడ్డలను ఏ మాత్రం పట్టించుకోలేదు. వారిని గాలికి వదిలేశాడు.

ఆగ్రాలో దారుణం, యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ఇద్దరు నపుంసకులు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధిత యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ గేట్ పోలీసులు

ఈ నేపథ్యంలో రెండవ భార్య ప్రభావతి కొడుకు దినేష్‌ (23) చలపతిరావు కాలనీలో తండ్రి పేరిట ఉన్న 8 సెంట్ల ఆస్తిలో తనకూ భాగం పంచాలని తండ్రిని ఒత్తిడి చేశాడు. తాను త్వరలో మదనపల్లెకు వస్తానని, ఆ రోజే దీనిపై మాట్లాడుతానని తండ్రి నచ్చ జెప్పాడు. ఆదివారం రాత్రి మదనపల్లెకు వచ్చిన భాస్కర్, చలపతిరావు కాలనీలోని తన పాత ఇంటిలో ఒంటరిగా ఉండటం చూసి దినేష్‌ తన అనుచరులతో వెళ్లి ఆస్తి పంపకం విషయమై నిలదీశాడు.

నా భర్త సెక్స్‌ చేస్తుంటే భరించలేని నొప్పితో ఏడుపొచ్చేది, నాకు ఉన్న రెండు యోనిలే కారణం..ఈ విషయం 25 ఏళ్ల వరకు నర్సు చెప్పే దాకా నాకు తెలియదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమెరికా యువతి బ్రిటనీ జాకోబ్స్ వీడియో

అయితే అతను ఆస్తిని పంచేందుకు అంగీకరించకపోవడంతో ఆగ్రహించాడు. కత్తితో దాడిచేసి, గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తన తండ్రి చనిపోయాడని భావించి పరారయ్యాడు. కొంతసేపటికి తేరుకున్న భాస్కర్‌ రామ్‌నగర్‌లో ఉన్న మరో కొడుకు వద్దకు వెళ్లి స్పృహ కోల్పోయాడు. వారు హుటాహుటిన అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్‌ఐలు ఆస్పత్రికి చేరుకుని ప్రాధమిక విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.