Road accident (image use for representational)

Nalgonda, Sep 19: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో (Road Accidents in TS) ఎనిమిది మంది మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూర్ హైవే ముత్యాలమ్మ గూడెం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం (Road Accident in Nalgonda) సంభవించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అయితే ట్రాఫిక్‌జామ్‌లో లారీ మరొక కారును ఢీకొట్టింది. దీంతో మరో కారులో ఉన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం మృతుల సంఖ్య అయిదుకు చేరింది. చనిపోయిన ఐదుగురిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. భారీగా హైవేపై ట్రాఫిక్ జామ్‌ను కట్టంగూర్‌ పోలీసులు క్లియర్ చేస్తున్నారు.

తాళి కట్టిన తరువాత డబ్బు, నగలతో వధువు పరార్, వరుడు నచ్చలేదని అందుకే నా లవర్‌తో లేచిపోతున్నానంటూ అమ్మమ్మకు ఫోన్, ఆందోళనకు దిగిన పెళ్లి కొడుకు తరపు బంధువులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, క్షతగాత్రుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలోని సూర్య తండాకు చెందిన ఓ కుటుంబం శనివారం చిన్నారుల కేశఖండన కోసం మద్దిమడుగు ఆంజనేయస్వామి గుడికి వెళ్లారు. ఆటోలో ఇవాళ తిరుగు పయనమయ్యారు. మద్దిమడుగుకు రెండు కిలోమీటర్ల సమీపంలోకి రాగానే దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది.

భార్య కరోనాతో మృతి, ఆమె చెల్లెలితో పెళ్లి చేయలేదని 4 గురు కూతుర్లను చంపిన కసాయి తండ్రి, తరువాత ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని 108 వాహనంలో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిసింది. అమ్రాబాద్‌ సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాద స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.