Nalgonda Road Accident: దేవుని దర్శనం చేసుకుని తిరిగివస్తుండగా మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే మృతి,వేగంగా వెళ్తూ కారును ఢీకొట్టిన లారీ
మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం (Nalgonda Road Accident) చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో నందిపాడు మండలానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.కృష్ణాజిల్లా మోపిదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళుతుండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణ మానస కాలనీ బైపాస్ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- Read in
- తెలుగు
మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం (Nalgonda Road Accident) చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో నందిపాడు మండలానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.కృష్ణాజిల్లా మోపిదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళుతుండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణ మానస కాలనీ బైపాస్ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన ( Five Members of Two Families Killed) వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుకుపల్లి మహేశ్ (32), ఆయన భార్య జ్యోతి(30), కుమార్తె రిషిత(6), మహేష్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లి గ్రామానికి చెందిన బొమ్మ మహేందర్(32), అతని కుమారుడు లియాన్సీ(2) అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య బొమ్మ మాధవి తీవ్రంగా గాయపడ్డారు. మాధవిని మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Here's Video
మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం.. కారును లారీ ఢీకొట్టడంతో నందిపాడు మండలానికి చెందిన ఐదుగురు మృతి
దైవదర్శనం చేసుకుని వస్తున్న వారు మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానానికి చేరే వారు. అంతలో విధి వక్రీకరించింది.
కృష్ణాజిల్లా మోపిదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకుని… pic.twitter.com/LXIP9BDgXz
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2024 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

