Hyderabad Shocker: వీడియో ఇదిగో.. ఆలయ గర్భగుడిలో మైనర్ బాలికతో అసభ్యకరంగా పూజారి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు..

పవిత్రమైన ఆలయ గర్భగుడిలోనే ఓ మైనర్ బాలికపై వృద్ధ పూజారి లైంగిక దాడికి పాల్పడిన అత్యంత దారుణమైన ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో వెలుగు చూసింది. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించి నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Temple Priest Held After Allegedly Being Found With Girl on Temple Premises (photo-Video Grab)

Hyderabad Shocker: పవిత్రమైన ఆలయ గర్భగుడిలోనే ఓ మైనర్ బాలికపై వృద్ధ పూజారి లైంగిక దాడికి పాల్పడిన అత్యంత దారుణమైన ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో వెలుగు చూసింది. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించి నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

రామచంద్రాపురంలోని ఒక స్థానిక ఆలయంలో సాయన్న అనే వృద్ధుడు అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు, గ్రామ పెద్దలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయ తలుపులు తెరిచి చూడగా, గర్భగుడిలో సాయన్న సదరు మైనర్ బాలికతో అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు అతడిని అక్కడికక్కడే పట్టుకుని రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించారు.

ఉపాధ్యాయుడితో స్టూటెంట్ రాసలీలలు వీడియో వైరల్.. ఇది నిజం కాదని MMS స్కాండల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక..

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించారు. నిందితుడు సాయన్నను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఆలయ ప్రాంగణంలో గతంలోనూ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇదివరకే పోలీసు దృష్టికి తీసుకెళ్లామని స్థానికులు తెలిపారు.

Priest Detained Over Alleged Objectionable Incident Involving Girl Inside Temple

బాధితురాలు మైనర్ కావడం వల్ల చట్ట ప్రకారం ఆమె వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆలయానికి ఏ పరిస్థితుల్లో వచ్చింది? నిందితుడితో ఆమెకు ముందే పరిచయం ఉందా? ఈ అకృత్యంలో మరికొందరి ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయాలపై లోతుగా విచారిస్తున్నారు. నిందితుడిపై POCSO, ఇతర కఠినమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement