Telangana: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా, తదుపరి షెడ్యూల్‌ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపిన బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన బిజీ షెడ్యూల్ వల్ల వాయిదా పడింది.పీఎంఓ షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులతో పాటు వందే భారత్‌ రైలును ప్రారంభించాల్సి ఉంది.

Telangana: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా, తదుపరి షెడ్యూల్‌ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపిన బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
Narendra Modi (Photo Credits: ANI)

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన బిజీ షెడ్యూల్ వల్ల వాయిదా పడింది.పీఎంఓ షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులతో పాటు వందే భారత్‌ రైలును ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ఈ పర్యటన వాయిదా పడినట్లు బుధవారం బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..

బిజీ షెడ్యూల్‌ వల్లే వాయిదా పడిందని చెబుతూ.. అతి త్వరలోనే పర్యటన తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. అయితే.. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. దీంతో వందే భారత్‌ రైలు ప్రారంభంపై సందిగ్ధత ఏర్పడినట్లయ్యింది.

(The above story first appeared on LatestLY on Jan 11, 2023 12:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).