Credits: Twitter

Hyderabad, Jan 10: తెలుగు రాష్ట్రాల ప్రజలకు (Telugu States) గుడ్ న్యూస్ (Good News). భారత రైల్వే శాఖ (Indian Railway) తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు (Vande Bharat)ను కేటాయించింది. అయితే ఈ సెమీ హైస్పీడ్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుందన్న దానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ (Visakha), విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుందని వెల్లడించారు.

ల్యాప్ టాప్, నోట్ బుక్, మొబైల్ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ లకు సౌకర్యవంతంగా కనెక్ట్ అయ్యేలా ఒకే యూనివర్సల్ చార్జర్.. కేంద్రం కొత్త నిబంధనలు

సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వందేభారత్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖ చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలును ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లో ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, 19న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

నెల్లూరు, తిరుపతిలో జియో 5జీ సేవలు వచ్చేశాయి, ఏపీలో 5జీ కోసం రూ.26,000 కోట్లను ఖర్చుపెట్టిన రిలయన్స్ జియో