Rains in Telangana: నేడు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణవ్యాప్తంగా ఈరోజు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Hyderabad, June 21: తెలంగాణవ్యాప్తంగా (Telangana) ఈరోజు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా 13 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇతర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ వర్షాలు కురువలేదు. దీంతో రైతుల్లో గుబులు మొదలైంది. అయితే తాజాగా వాతావరణ శాఖ చెప్పిన చల్లనికబురుతో ఇప్పుడు రైతన్నలు ఆశగా వాన కోసం ఎదురుచూస్తున్నారు.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు
ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, కామారెడ్డి.
వీడియో ఇదిగో, పట్టపగలు బురఖా ధరించి బంగారం షాపులో చోరి, యజమాని ప్రతిఘటించడంతో కత్తితో దాడి
(The above story first appeared on LatestLY on Jun 21, 2024 11:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

