Rythu Bandhu: అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రైతు బంధు పంపిణీకి బ్రేక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఎందుకంటే?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.
Hyderabad, Nov 27: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) వేళ అధికార బీఆర్ఎస్ (BRS) కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధుకు (Rythu Bandhu) ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లఘించారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో అనుమతిని వెనక్కి తీసుకున్నట్లుగా ఈసీ ప్రకటించింది. వెంటనే రైతుబంధు నిధుల విడుదల ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్ 28లోపు రైతుబంధు నగదును పంపిణీ చేసుకోవచ్చునని చెప్పిన ఈసీ ఇప్పుడు వెనక్కి తీసుకోమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికలకు ముందు రైతుబంధు డబ్బు పంపిణీకి భారత ఎన్నికల సంఘం (ECI) అనుమతిని ఉపసంహరించుకుంది.. | Tolivelugu#RythuBandhu #TelanganaElection2023 #ElectionCommission #TeluguNews #Tolivelugu pic.twitter.com/MvWmzGPYc1
— Tolivelugu Official (@Tolivelugu) November 27, 2023
కారణం ఏంటంటే?
ఎన్నికల ప్రచార సభలపై రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. అదేవిధంగా ఎన్నికల్లో లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయరాదని రైతుబంధు విషయంలో సీఈసీ ముందే షరతు విధించింది. అయితే రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అందుకే అనుమతిని ఉపసంహరించుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Nov 27, 2023 11:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

