Tirumala, Nov 27: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ (TTD) ఛైర్మన్, ఈవో, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు. మోదీ ఆలయంలోనే దాదాపు 50 నిమిషాలు గడిపారు. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. ప్రధాని వెళ్లే మార్గాలలో దుకాణాలను మూయించారు. మీడియాను కూడా అనుమతించలేదు.

Israel Informers killed: ఇజ్రాయెల్‌ ‘ఇన్‌ఫార్మర్ల’ను దారుణంగా చంపి.. స్తంభానికి మృతదేహాలు వేలాడదీత.. పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదుల దారుణం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)