కర్నూలు కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్‌ బస్సుల వేగనియంత్రణకు చర్యలు తీసుకుంటాన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

నిద్రలోనే తిరిగిరాని లోకాలకు.. కర్నూల్ బస్సు అగ్ని ప్రమాదంలో ఎన్నో విషాద కథలు, ఒకే కుటుంబంలో నలుగురు మృతి, 20 మంది సజీవదహనం, మరో 21 మందికి గాయాలు

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్‌9490లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు సిబ్బంది, 40 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా.. 21 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.

Kurnool Bus Fire Accident:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)