Singer Rahul Sipliganj: కాంగ్రెస్ టికెట్‌కోసం ఆస్కార్ సింగర్ అప్లికేషన్, ఏ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నాడంటే?

సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. గోషామహాల్ (Goshamahal) టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో రాహుల్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇక దరఖాస్తుల పరిశీలన తర్వాత.. ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని పీసీసీ ఎంపిక చేస్తుంది.

Singer Rahul Sipliganj: కాంగ్రెస్ టికెట్‌కోసం ఆస్కార్ సింగర్ అప్లికేషన్, ఏ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నాడంటే?
Rahul Sipliganj (PIC@ Twitter)

Hyderabad, AUG 25: గాంధీ భవన్‌ వద్ద కోలాహలం నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ (Congress) తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవాళ చివరిరోజు కాగా.. దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. గోషామహాల్ (Goshamahal) టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో రాహుల్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇక దరఖాస్తుల పరిశీలన తర్వాత.. ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని పీసీసీ ఎంపిక చేస్తుంది. ఇప్పటి వరకు 900 దరఖాస్తులు దాటినట్లు తెలుస్తోంది. చివరి రోజు కావడంతో సాయంత్రం వరకు దరఖాస్తుల సంఖ్య వేయి దాటుతుందని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telangana Assembly Elections 2023: అల్లుడైనా.. కొడుకైనా సరే, కంటోన్మెంట్ నుండి పోటీకి సై అంటున్న సర్వే సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల గడువు నేటితో ముగింపు 

యూట్యూబర్‌గా లోకల్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌ (Singer Rahul Sipliganj), ఆపై టాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా అలరిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 50కిపైగా చిత్రాల్లో పాడారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌-3 విజేతగానూ నిలిచారు. రాజమౌళి ట్రిపుల్‌ఆర్‌ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కుగానూ ఆస్కార్‌ దక్కగా.. ఆ సాంగ్‌ సింగర్‌ అయిన రాహుల్‌కు ఆస్కార్‌ ఆ వేదికపైనా పాడి అలరించే అవకాశం దక్కింది కూడా.

(The above story first appeared on LatestLY on Aug 25, 2023 07:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).