Telangana Assembly Election 2023: రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్లే, వాళ్లకి కొంచెమైనా సిగ్గుందా, హస్తంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని... ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు.

Telangana Assembly Election 2023: రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్లే, వాళ్లకి కొంచెమైనా సిగ్గుందా, హస్తంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
If Telangana gets a double road, Andhra Pradesh gets a single road - CM KCR

Hyd, Nov 27: ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని... ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని... ఎవరైనా మూడేళ్లకు మించి కౌలుకు ఇస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయని... రైతుల వేలిముద్ర లేకుండా భూరికార్డులను మఖ్యమంత్రి కూడా మార్చలేరని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్‌ షాద్‌నగర్‌, చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం.

పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లే, కేసీఆర్‌ను గెలిపిస్తే రాహుల్ బాబాను ప్రధానిని చేస్తాడని అమిత్ షా ఎద్దేవా

కాంగ్రెస్‌ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్‌ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్‌నగర్‌ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్‌నగర్‌కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్‌ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్‌ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు.

తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్‌లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.

తెలంగాణకు తర్వాతి సీఎం బీజేపీ నుంచే, బీఆర్‌ఎస్‌ పార్టీని దరిదాపుల్లోకి కూడా రానివ్వమని తెలిపిన ప్రధాని మోదీ

పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు.

రైతుబంధు ఆపాలని గత నెలలోనే ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని కేసీఆర్ దుయ్యబట్టారు. తాను విన్నవిస్తే... ఈ నెల 28న రైతుబంధు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అనుమతించిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మరోసారి ఫిర్యాదు చేస్తే రైతుబంధును మళ్లీ ఆపేసిందని తెలిపారు.

తెలంగాణను 1956లో ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని కేసీఆర్ విమర్శించారు. మన తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 50 ఏళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. 2004లో ప్రకటించిన తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదని.. తాను నిరాహారదీక్షకు కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తల వంచిందని అన్నారు. గులాబీ జెండాను పట్టుకుని అందరం పోరాడిన తర్వాతే తెలంగాణను ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు పార్టీ చరిత్ర కూడా చూడాలని అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

(The above story first appeared on LatestLY on Nov 27, 2023 06:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).