Hyd, Nov 27: కాంగ్రెస్ ( Congress ) పార్టీతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుమ్మక్కయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) మండిపడ్డారు. సోమవారం నాడు మంచిర్యాల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ...‘‘ ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టేనని అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కోనేశాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే మళ్లీ కేసీఆర్ కోనేస్తాడని అన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే రాహుల్ బాబాను ప్రధానిని చేస్తాడని అమిత్ షా ఎద్దేవ చేశారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ ప్రభుత్వం రాదని చెప్పారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భయపడే కేసీఆర్ హైదరాబాద్ విమోచనదినోత్సవం జరపడం లేదన్నారు.కేసీఆర్, కాంగ్రెస్‌లు ఓవైసీ కి భయపడుతున్నారని దెప్పిపోడిశారు.
ముస్లింలకు ఇచ్చిన 4శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్నారు. మాదిగల సంక్షేమం కోసం ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుందన్నారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మాఫీ చేస్తామని అమిత్ షా ప్రకటించారు.
పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారు: ప్రధాని మోదీ
తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని, పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందినవారే సీఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యన్నతి బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
కరీంనగర్ షోడశమహాజనపదాల్లో ఒకటిగా ఉండేదని ప్రధాని మోదీ చెప్పారు. పదేళ్ల పిల్లల్ల భవిష్యత్ కోసమే తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తారు.. అలాగే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేయాలని కోరారు. కరీంనగర్ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. దేశం కోసమే ఓటు వేయాలంటే అది బీజేపీకి మాత్రమే ఓటేయాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గమనించినట్లు మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ జరిగింది? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమని వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఓటేయడమంటే అది బీఆర్‌ఎస్‌కేనని ప్రజలు గుర్తించాలని చెప్పారు. కేసీఆర్‌ను వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయొద్దని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పిల్లల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీని చేస్తామంటే కేసీఆర్ అడ్డుపడ్డారని పేర్కొన్న మోదీ.. కరీంనగర్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు. పీవీ నరసింహారావుని కాంగ్రెస్ ఎప్పుడూ నిర్లక్ష‍్యం చేసిందని చెప్పారు.
రైతులకు నీళ్లిచ్చేందుకు కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని మోదీ ఆరోపించారు. కుటుంబ పాలకులు వారి పిల్లల గురించే ఆలోచిస్తారు.. ప్రజల పిల్లల గురించి ఆలోచించబోరని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ వంటి సంస్థలు పెరిగిపోయాయని తెలిపారు. ఫిలిగ్రి కళకు కరీంనగర్ పెట్టింది పేరు.. అలాంటి కళలను ప్రోత్సహించేందుకు కేంద్రం విశ్వ కర్మ యోజనను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా లక్షలాది రూపాయలు గ్యారెంటీ లేకుండానే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ నీడ పడితే కలలన్నీ చెదిరిపోతాయని భయం.. అందుకే తనను సీఎం కేసీఆర్ కలవట్లేదని విమర్శించారు.