BSP Election Manifesto: యువతకు పది లక్షల ఉద్యోగాలు, తెలంగాణ బీఎస్‌పీ మేనిఫెస్టో ఇదిగో, విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై ప్రధానంగా దృష్టి

బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్‌ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కాగా ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను పార్టీ ప్రకటించింది.

BSP Election Manifesto: యువతకు పది లక్షల ఉద్యోగాలు, తెలంగాణ బీఎస్‌పీ మేనిఫెస్టో ఇదిగో, విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై ప్రధానంగా దృష్టి
Telangana BSP chief RS Praveen Kumar (Photo: ANI)

Hyd, Oct 17: బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్‌ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కాగా ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను పార్టీ ప్రకటించింది.

వీడియో ఇదిగో, తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు, వ్యాన్‌లో లెక్కలు లేని రూ. 2.36 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న కరీంనగర్ పోలీసులు

తాజాగా.. మేనిఫెస్టోను విడుదల చేశారు. బీఎస్‌పీ మేనిఫెస్టోలో విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కాగా, తెలంగాణలో ఐపీఎస్‌గా సేవలందించిన ఆర్ఎస్పీ ప్రస్తుతం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఆర్ఎస్పీ ఈ ఎన్నికల్లో సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.

కాన్షీ యువ సర్కార్

= యువతకు ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు.

= అందులో మహిళలకు 5 లక్షల కొలువులు.

= షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు

బహుజన రైతుబీమా

= ప్రతీ పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు

= రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ

= ధరణి పోర్టర్ రద్దు

దొడ్డి కొమురయ్య భూమి హక్కు

= భూమి లేని ప్రతీ పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి

= ఆ ఎకరం భూమి మహిళల పేరిట పట్ట

చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి

= మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్లు.

= మహిళలకు స్మార్ట్‌ఫోన్ మరియు డ్రైవింగ్ శిక్షణ

= అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ

భీమ్ రక్షా కేంద్రాలు

= వృద్ధులకు హాస్టల్, ఆహారం మరియు ఉచిత వైద్యం

= రక్షా కేంద్రాల్లో వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు తోడ్పాటు

పూలే విద్యా దీవెన

= మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు. ప్రతీ మండలం నుంచి ఏటా వంద మంది విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య

= డేటా ఏఐ మరియు కోడింగ్‌లో శిక్షణ

బ్లూ జాబ్ కార్డ్

= పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ

= రోజూ కూలీ రూ.350 పెంపు

= కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్యం మరియు జీవిత బీమా

నూరేళ్ల ఆరోగ్య ధీమా

= ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య భీమా

= ఏటా రూ.25 వేల కోట్లతో పౌష్టికాహార ఆరోగ్య బడ్జెట్

వలస కార్మికుల సంక్షేమ నిధి

= రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు

= వలస కార్మికులకు వసతి

= గిగ్ కార్మికులు, లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు

షేక్ బందగి గృహ భరోసా

= ఇళ్లు లేని వారికి 550 ఇంటి స్థలం కేటాయింపు

= ఇళ్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల సాయం

= ఇంటి పునర్మిణానికి రూ.1.50 లక్షల సాయం

(The above story first appeared on LatestLY on Oct 17, 2023 04:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).